ఆ షోకు వచ్చే గెస్ట్ ల రెమెన్యూరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

టాలీవుడ్ లో ఆలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటు కమెడియన్ గా, ఇటు హీరోగా, ప్రొడ్యూసర్ గా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేరు ఉంది. ప్రస్తుతం ఆలీ ఓ టీవీ షోలో మాత్రమే మనకు కనిపిస్తున్నారు. ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తన షో ద్వారా సెలబ్రిటీల మనో గతాన్ని, తమ జీవితాలలో జరిగిన సుఖాలను, దుఖాలను ఆలీ ప్రేక్షకులకు, అభిమానులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ షో ద్వారా చాలా మంది తమ జీవితంలో జరిగిన సంఘటనలను నెమరేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఈటీవీలోొ ప్రసారమయ్యే ఈ ఆలీతో సరదాగా షో మోస్ట్ క్రేజీ టాక్ షోగా రికార్డు నెలకొల్పింది. ఈ ప్రోగ్రామ్ కు వచ్చే సెలబ్రిటీలకు కొంత రుసుము అనేది వెళ్తుంటుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆలీతో సరదాగా షోలో చాలా మంది సెలబ్రిటీలు ఇరుకున పెట్టే ప్రశ్నలను ఆలీ వేస్తుంటారు. ఆ సమయంలో వారు బావోద్వేగానికి లోనవుతుంటారు. ఇంకొందరు లైట్ తీసుకుంటారు. కానీ సమాధానం అయితే ఏదో ఒకటి చెబుతారు. అందుకే ఈ షో గత ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా సాగుతోంది. కరోనా ఎఫెక్ట్ వలన ఈ షోకు సెలబ్రిటీలు రావడం తగ్గింది. కరోనా భయంతో చాలా మంది సెలబ్రిటీలు ఈ షోకు రావడానికి జంకారు. ఇటువంటి షోలకు వచ్చే సెలబ్రిటీలకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే షోకు వచ్చే సెలబ్రిటీలను బట్టీ కొందరి ప్రయాణ చార్జీలు కూడా ప్రోగ్రామ్ చేసేటటువంటి వారు భరిస్తారు. అయితే కొత్త సినిమా ప్రమోషన్ల కోసం వచ్చే వారికి ఎటువంటి డబ్బులు ఇవ్వరు. వారు తమ నూతన సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పడం ద్వారా వారి సినిమాకు ప్రమోషన్ అవుతుంది కాబట్టి నిర్వాహకులు వారికి ఎటువంటి డబ్బులు చెల్లించరు.

Share post:

Latest