రెండో పెళ్లికి సిద్ధ‌మైన సుమంత్..అమ్మాయి ఎవ‌రంటే?

July 28, 2021 at 9:09 am

అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్టింగ్‌లో కొన్ని హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత‌ సుమంత్ కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. మ‌ళ్లీ ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడీయ‌న‌. ఇక ఈయన వ్యక్తిగత జీవితం విష‌యానికి వ‌స్తే..2004 సంవత్సరంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ని వివాహం చేసుకొని.. 2006 లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు.

Keerthi Reddy | Keerthi Reddy Latest Pics | Tholi Prema Actress Keerthi Reddy New Photos | Keerti Reddy Present Husband | Toliprema Actress Keerthi Reddy | Pawan Kalyan Keerthi Reddy | - Filmibeat

అప్ప‌టి నుంచి సుమంత్ ఒంట‌రిగానే ఉంటున్నారు. కీర్తి రెడ్డి మాత్రం మ‌రొక వ్య‌క్తిని వివాహం చేసుకుని సెటిల్ అయింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. సుమంత్ దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత రెండో పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడు. అవును.. పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ రెండో వివాహం చేసుకోబోతున్నాడు.

 ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా చాలా సైలెంట్‌గా జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. చాలా తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో సుమంత్ మరోసారి ఇంటివాడు కానున్నాడని తెలుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం త్వరలోనే బయటికి రానుంది.

ఇప్ప‌టికే వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంపడం జరిగింది. ప్ర‌స్తుతం వీళ్ళ వెడ్డింగ్ కార్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే సాదాసీదాగా జరగనున్నట్టు సమాచారం. అయితే ఈ పెళ్లిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రెండో పెళ్లికి సిద్ధ‌మైన సుమంత్..అమ్మాయి ఎవ‌రంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts