స్పీడ్ పెంచిన అఖిల్‌..మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్‌?!

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. హిట్ కొట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అఖిల్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నారు.

Akkineni Akhil: 'Agent' first look .. Stunning poster release .. Akkineni  Warabbai changed gear! - Hayat News

అయితే ఈ సినిమా పూర్తి కాక‌ముందే.. స్పీడ్ పెంచేసి మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు అఖిల్‌. `అందాల రాక్షసి` సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న హను రాఘవపూడి.. ఇటీవ‌ల అఖిల్‌ను క‌లిసి ఓ క‌థ చెప్పాడ‌ట‌. అది బాగా న‌చ్చ‌డంలో.. సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

No Compromise For Hanu Raghavapudi Next

అంతేకాదు, ఇదో ల‌వ్ స్టోరీ అని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‏టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.