స్టార్ట్ అయిన‌ `ఆదిపురుష్‌` షూట్‌..ప్ర‌భాస్ దిగేది అప్పుడేన‌ట‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఆదిపురుష్‌. రామాయ‌ణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, ల‌క్ష్మ‌ణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ క‌నిపించనున్నారు. అలాగే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ న‌టిస్తున్నాడు.

- Advertisement -

టీ సిరీస్ బ్యానర్‌పై పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. అయితే క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. చాలా రోజుల త‌ర్వాత శ‌నివారం ముంబైలో ప్రారంభ‌మైంది. అయితే ప్ర‌భాస్ లేకుండానే షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు మేక‌ర్స్‌. సీతగా నటిస్తున్న కృతీ సనన్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

అయితే ప్రభాస్ ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో రాధేశ్యామ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. పెండింగ్‌లో ఉన్న కొన్ని సన్నివేశాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ రాధేశ్యామ్ షూటింగ్‌ పూర్తి అయిన త‌ర్వాతే.. ప్ర‌భాస్ ఆదిపురుష్ సెట్‌లో అడుగు పెడ‌తాడ‌ని తెలుస్తోంది.

Share post:

Popular