తాను చాలా ప్రమాదక‌రం అంటున్న మెహ్రీన్‌..?!

మెహ్రీన్ కౌర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె భవ్య బిష్ణోయ్‏తో నిశ్చితార్థం ర‌ద్దు చేసుకుని వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన మెహ్రీన్‌.. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఎఫ్ 3తో పాటు మ‌రిన్ని చిత్రాల‌తో బిజీగా గ‌డుపుతోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్‌.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టింది. `అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి వేరే వారి కత్తి మీద ఆధారపడడానికి అంగీక‌రించ‌దు. ఎందుకంటే ఆమెకే సొంతంగా ఓ కత్తి ఉంటుంది` అని పేర్కొంటూ త‌న లేటెస్ట్ ఫొటోను షేర్ చేసింది.

ఇక మెహ్రీన్ పెట్టిన కొటేషన్‌ కాస్త గందరగోళంగా ఉన్న‌ప్ప‌టికీ.. పరోక్షంగా తాను చాలా ప్రమాదక‌రం అని, తనని తాను రక్షించుకునేందుకు ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌న‌ని చెప్ప‌క‌నే చెప్పింది. దాంతో మెహ్రీన్ ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CRG1LKVs1pS/?utm_source=ig_web_copy_link

Share post:

Popular