వైరల్ అవుతోన్న అల్లు అర్జున్ న్యూ లుక్..!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్ని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘పుష్ప’. వీరి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రజెంట్ పాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ రాబోతున్నది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ పిక్చర్ బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోను బన్నీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పొడవాటి జుత్తు, నల్లని కళ్లద్దాలు, గెడ్డంతో బన్నీ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ లుక్ కానీ ‘పుష్ప‌’లో కూడా ఉంటే సరికొత్త రికార్డ్స్ ఖాయం అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ‘తగ్గేదెలే’ అనే డైలాగ్ ఇంకా నెట్టింట ట్రెండవుతూనే ఉంది. అడవులతో పాటు గ్రామీణ నేపథ్యంలోనే సినిమా మొత్తం ఉండబోతుంది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందిన నటిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన గిరిజన యువతిగా రష్మిక కనిపించబోతుంది. ఐటమ్స్ సాంగ్‌కు కేరాఫ్ అయిన సుకుమార్ ‘పుష్ప’లోనూ డిఫరెంట్ సాంగ్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Share post:

Latest