మాస్ట‌ర్ రికార్డుల‌ను చిత్తు చిత్తు చేసిన వైష్ణ‌వ్ తేజ్!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ డ‌బ్యూ చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా కనిపించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

థియేట‌ర్ల‌లోనే కాదు.. బుల్లితెర‌పై సైతం ఉప్పెన సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ నేప‌థ్యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి మాస్ట‌ర్ సినిమా రికార్డుల‌ను చిత్తు చిత్తు చేశాడు వైష్ణ‌వ్‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 18న ఉప్పెన సినిమా మొద‌టి సారి స్మాల్ స్క్రీన్‌పై ప్ర‌సారం కాగా.. అప్పుడు 18.5 టీఆర్పీ వ‌చ్చింది. ఇక తాజాగా రెండో సారి ప్ర‌సారం కాగా, 11.37 ద‌క్కింది.

అయితే అదే స‌మ‌యంలో ఉప్పెన‌కు పోటీగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ సినిమా వేరే ఛాన‌ల్‌లో ప్ర‌సారం అయింది. ఈ సినిమా తొలి సారి ప్ర‌సారం అయిన‌ప్పుడు 4.8 టీఆర్పీ రేటింగ్ ద‌క్కించుకోగా, రెండో సారి 3.8 రేటింగ్ పొందింది. ఈ లెక్క‌న మాస్ట‌ర్ టీఆర్పీని వైష్ణ‌వ్ ఏ రేంజ్‌లో బీట్ చేశాడో స్ప‌ష్టంగా తెలుస్తోంది.

Share post:

Latest