నా ఫెల్యూర్‌కు అదే కార‌ణం..శ్రీను వైట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

శ్రీను వైట్ల.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నీ కోసం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈయ‌న‌.. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి స్టార్ డైరెక్ట‌ర్ స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు ఈయన సినిమా వచ్చిందంటే కచ్చితంగా బాక్సాఫీస్ బద్ధలైపోయేది.

కానీ ఆగడు నుంచి శ్రీ‌ను వైట్ల కెరీర్ పూర్తిగా డ‌ల్ అయింది. భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత ఈయ‌న చేసిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా అన్నీ ఫ్లాపులుగా నిలిచాయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఈయ‌న‌.. త‌న ఫెల్యూర్‌కు కార‌ణం ఏంటో రివిల్ చేశారు. శ్రీ‌ను వైట్ల మాట్లాడుతూ.. మొదటి నుంచి కూడా నేను వినోదప్రధానమైన సినిమాలనే చేస్తూ వెళ్లాను.

నా సినిమాలు ఒకే రకంగా ఉంటున్నాయనే టాక్ రావడంతో, కొత్తగా చేయాలనే ఉద్దేశంతో రూట్ మార్చాను. కానీ శ్రీను వైట్ల సినిమాలు ఇలాగే ఉండాలని కోరుకున్న ప్రేక్షకులకు, నేను నా స్టైల్ ను మార్చుకోవడం నచ్చలేదు. అందువల్లనే ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయి. అందుకే ఇకపై అలాంటి చేయ‌ను అంటూ చెప్పుకోచ్చారు. కాగా, ప్ర‌స్తుతం ఈయ‌న మంచు విష్ణు హీరోగా డి అండ్ డి సినిమా చేస్తున్నారు.