శాండిల్‌వుడ్ న‌టుడు సంచారి విజ‌య్ క‌న్నుమూత‌!

ప్ర‌స్తుతం క‌రోనాతో అన్ని ఇండ‌స్ట్రీల్లో విషాదాలు నిండుతున్నాయి. ఇప్ప‌టికే చాలామంది డైరెక్ట‌ర్లు, నిర్మాతలు, నటీనటులు ఇత‌ర టెక్నిక‌ల్ అసిస్టెంట్లు చ‌నిపోయారు. వీటిని మ‌ర‌వ‌క ముందే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మరో విషాదం నిండింది. శాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటుడు సంచారి విజయ్ ఈరోజు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్ప‌త్రిలో చ‌నిపోయారు. ఈ విషయాన్ని పలువురు చిత్ర ప్రముఖులతో పాటు హీరో కిచ్చా సుదీప్ త‌మ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు.

సంచారి విజ‌య్ చాలా భాష‌ల్లో న‌టించారు. క‌న్న‌డలో ఆయ‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంచారి విజయ్‌. కాగా ఆయ‌న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్ప‌త్రిలో చేరారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివ‌ర‌కు మ‌ర‌ణించారు. జూన్‌ 12 రాత్రి విజయ్‌ తన ఫ్రెండ్‌ను కలిసిన త‌ర్వాత బైక్‌పై ఇంటికి వెళ్తున్న టైమ్‌లో యాక్సిడెంట్ అయింది. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న తలకు, కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి.