సికింద్రాబాద్ లో విషాద ఘటన..?

సికింద్రాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మోండా మార్కెట్ వ‌ద్ద దారుణం జరిగింది. ఆ ప్రాంతంలో హైద‌రాబాద్ మెట్రో రైలు ప‌నులు కొన‌సాగుతున్నాయి. అందులో భాగంగా మెట్రోరైల్ పిల్ల‌ర్ వేయ‌డానికి ఆ ప్రాంతంలో గుంత తీశారు. అయితే, అటువైపుగా వ‌చ్చిన ఓ బాలుడు ప్రమాద‌వశాత్తూ అందులో ప‌డ్డాడు. దీనిని గ‌మ‌నించిన మెట్రోరైలు సిబ్బంది, స్థానికులు బాలుడిని వెలికి తీశారు. అయితే అప్ప‌టికే బాలుడు మృతి చెందాడు. బోయినపల్లిలోని చిన్నతోకట్ట నాలాలో పడి ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడు కన్నుమూశాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నాలాలో పడిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 3గంటల సేపు సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేదు. చివరికి ఆనంద్‌సాయి మృతదేహాన్ని బయటికి తీశారు. నాలాకు రక్షణ గోడ లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. కొడుకును నాలా మింగేయటంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. గతంలో ఎన్నో సార్లు అధికారులకు, పాలకులకు స్థానికులు నాలా గురించి తెలిపినప్పటికీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీ గోడ నాలా చుట్టూ ఏర్పాటు చెయ్యకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అధికారులు, పాలకులు స్పందించి ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.