కరోనా పేర్లపై ఆర్జీవీ కామెంట్స్ వైరల్..!

సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు వ్యంగంగా ఉంటూనే ఆలోచింపజేస్తాయి. తాజాగా వర్మ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆలోచనలో పడేసింది. అవును కదా అనే భావన కలిగేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే….

- Advertisement -

కరోనా పేరంటేనే జనాలు హడలిపోయే రోజులివి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూస్తున్న నూతన కరోనా వేరియంట్లకు శాస్త్రవేత్తలు రకరకాల పేర్లు పెడుతున్నారు. ఈ పేర్లెవరికీ అర్థం కాదనేవి అందరికీ తెలిసిన విషయమే. నూతనంగా వెలుగు చూసిన కరోనా వేరియంట్లకు శాస్త్రవేత్తలు Bi7172, Nk4421, K9472 ,AV415 గా నామకరణం చేశారు. ఈ విషయం పై వర్మ స్పందిస్తూ… ఇలా అర్థం కాని పేర్లు పెట్టే బదులు అందరికీ అర్థమయ్యే రీతిలో చింటూ, ప్యారీలాల్, సుబ్బారావు, జాన్ డేవిడ్ లాంటి ఈజీ పేర్లను పెట్టొచ్చు.. కదా అని ప్రశ్నిస్తూ.. ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారడంతో పాటు వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.

Share post:

Popular