ర‌వితేజ డేరింగ్ స్టెప్‌..దుబాయ్‌కి `ఖిలాడి` టీమ్‌?!

టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజా చిత్రం ఖిలాడి. రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్ల‌పై సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డ‌టంతో.. శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం అన్నీ చిత్రాలు సెట్స్ మీద‌కు వెళ్తుండ‌డంతో.. ఖిలాడీ షూటింగ్‌ని కూడా రీ స్టార్ట్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే జూలై రెండో వారంలో ఖిలాడీని హైద‌రాబాద్‌లో ప్రారంభించి.. ఆ వెంట‌నే దుబాయ్‌కు వెళ్ల‌నున్నార‌ట‌.

దుబాయ్‌ను బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం పూర్తి చేసి.. అక్క‌డే గుమ్మడికాయ కొట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయి. కానీ, వైర‌స్ పూర్తిగా స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. ఇలాంటి త‌రుణంలో ర‌వితేజ‌ మ‌రియు ఖిలాడి టీమ్ దుబాయ్‌కు వెళ్ల‌డం డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి.

Share post:

Latest