మ‌రో కోలీవుడ్ డైరెక్ట‌ర్‌కు రామ్ గ్రీన్‌సిగ్నెల్‌..త్వ‌ర‌లోనే..?

June 2, 2021 at 8:26 am

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి న‌టిస్తోంది. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. రామ్ మ‌రో కోలీవుడ్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. త‌మిళ దర్శకుడు ఏ.ఆర్‌. మురగదాస్‌, రామ్ కాంబోలో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంద‌ట‌. ఇటీవ‌లె ముర‌గ‌దాస్ రామ్‌కు ఓ క‌థ చెప్ప‌గా.. అది న‌చ్చ‌డంతో రామ్ వెంట‌నే ఓకే చెప్పాడ‌ట‌.

ఇక త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై ప్ర‌క‌ట‌న రానుంద‌ని స‌మాచారం. అలాగే ఈ చిత్రాన్ని మురగదాస్‌ తన సొంత ప్రొడక్షన్‌ హౌస్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

మ‌రో కోలీవుడ్ డైరెక్ట‌ర్‌కు రామ్ గ్రీన్‌సిగ్నెల్‌..త్వ‌ర‌లోనే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts