‘ఆర్ఆర్‌ఆర్‌’ విడుద‌ల‌పై జ‌క్క‌న్న‌ సంచలన నిర్ణయం?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ చిత్రంలో ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తుంటే..అజయ్ దేవగణ్‌, సముద్రఖని, శ్రియా శరణ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్ష‌కులు కూడా ఎప్ప‌టి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఎదురు చూసే కొద్ది ఈ సినిమా లేట్ అవుతూనే ఉంది. చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్ర‌క‌టించారు.

కానీ, తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ఆర్ఆర్‌ఆర్ విడుద‌ల‌ను మ‌రోసారి వాయిదా వేయాల‌ని జ‌క్క‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 2022 ఏప్రిల్ 28న విడుదల చేస్తే బాగుంటుందని రాజమౌళి సూచించినట్లు సమాచారం. మిగిలిన షూటింగ్‌కు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా ఆరేడు నెలల సమయం పడుతుందని, అందుకే 2022 సమ్మర్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని మేకర్స్‌ కూడా భావిస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.