మ‌ళ్లీ ఓటీటీ వైపే చూస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు?!

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్‌.. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో విడుద‌లై.. మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఆనంద్ మూడో చిత్రం పుష్పక విమానం. దామోదర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శాన్వి మేఘన, గీత్ సాయిని ఇందులో హీరోయిన్స్‌గా చేస్తున్నారు. అయితే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం ఓటీటీ వైపు చూస్తున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేసినా, వరుసగా పెద్ద సినిమాలు ఉండటం వల్ల పుష్పకవిమానం వాటి మధ్య నిలబడుతుందా అనే సందేహం మేకర్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

Share post:

Popular