సిద్ధమైన ‘నారప్ప’.. మ‌రో వారం రోజుల్లోనే..?

June 16, 2021 at 11:03 am

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో నార‌ప్ప ఒక‌టి. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించింది. త‌న‌ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో వెంకీ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో క‌నిపించ‌నున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాపై శ్రీకాంత్‌ అడ్డాల క్రేజీ అప్డేట్ ఇచ్చారు. శ్రీ‌కాంత్ అడ్డాల మాట్లాడుతూ.. వారం రోజుల్లో ఫస్ట్ కాపీ సిద్ధం కానుంది.

విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామ‌ని వెల్ల‌డించారు. కాగా, ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌, పోస్టర్స్‌తో పాటు వెంకటేశ్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కు మంచి స్పందిన ల‌భించింది. ఈ నేప‌థ్యంలోనే నార‌ప్ప‌ను ఎప్పుడెప్పుడు చూడాలా అని వెంకీ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్‌గా ఉన్నారు.

సిద్ధమైన ‘నారప్ప’.. మ‌రో వారం రోజుల్లోనే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts