నా శ‌రీరంపై దారుణంగా ట్రోల్స్‌ చేశారు..ప్రియ‌మ‌ణి ఆవేద‌న‌!

ఎవరే అతగాడు? సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప్రియ‌మ‌ణి.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే అగ్రహీలందరి స‌ర‌స‌న ఆడిపాడి స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అయింది. అయితే ముస్తఫా రాజ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన త‌ర్వాత ప్రియమణి సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చింది.

అయితే ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మ‌డు.. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో య‌మా జోరు చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌మ‌ణి.. త‌న శ‌రీరంపై నెటిజ‌న్లు చేసిన ట్రోల్స్ గురించి చెబుతూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న శ‌రీర రంగు, బ‌రువుపై చాలా మంది దారుణంగా ట్రోల్స్ చేశార‌ని.. చేస్తున్నార‌ని పేర్కొంది ప్రియ‌మ‌ణి.

ఫ్యాట్ అండ్ ఆంటీ అని ట్రోలింగ్ చేశార‌ని.. దాంతో చాలా క‌ష్ట‌ప‌డి బ‌రువు త‌గ్గాన‌ని అయినా ట్రోల్స్ ఆపలేదు అంటూ ప్రియ‌మ‌ణి వాపోయింది. ఇక త‌న శరీర రంగు గురించి ఎంద‌రో ర‌క‌ర‌కాల కామెంట్స్ చేశారు.. అవును నేను ముదురు రంగులో ఉన్న వ్య‌క్తిని.. అందులో త‌ప్పు ఏముంది.? మొదట మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఎవ‌రినీ న‌ల్ల‌గా ఉన్నార‌ని అనొద్దు. ఎందుకంటే న‌లుపే అంద‌మైన‌ది అంటూ త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించింది.

Share post:

Popular