రాధేశ్యామ్‌లో నా పాత్ర అదే..ప్ర‌భాస్ అలా పిలుస్తాడు:ప్రియదర్శి

June 17, 2021 at 9:55 am

ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం రాధే శ్యామ్‌. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌ద‌ర్శి.. రాధేశ్యామ్‌లో త‌న పాత్ర ఏంటో రివిల్ చేశాడు. రాధే శ్యామ్ ఒక గ్రేట్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ అని, ఇందులో తనది హీరోయిన్ పూజా హెగ్డేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసే పాత్ర అని ప్రియ‌ద‌ర్శి తెలిపాడు.

అలాగే తనకు ప్రభాస్ అన్నకు మధ్య మంచి కామెడీ సీన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ తనను స్వీట్ హార్ట్ అని పిలుస్తాడని.. ఆయనతో ఎక్కువ సమయం గడపాలని మాట్లాడాలని అనిపిస్తుందని.. మ‌రియు ఆయ‌న ఆతిథ్యాన్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేన‌ని ప్రియ‌ద‌ర్శి చెప్పుకొచ్చాడు. దీంతో ఆయ‌న వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.

రాధేశ్యామ్‌లో నా పాత్ర అదే..ప్ర‌భాస్ అలా పిలుస్తాడు:ప్రియదర్శి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts