అనిల్‌ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

వ‌కీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్‌.. ప్రస్తుతం వ‌రుస సినిమాల‌కు క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే వ‌కీల్ సాబ్ నిర్మించిన దిల్ రాజు ప‌వ‌న్‌తో మ‌రో సినిమా చేసేందుకు అప్పుడే ఒప్పించాడు. అంతేకాదు, అడ్వాన్స్ కూడా ప‌వ‌న్‌కు ముట్ట‌చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఇక ప్ర‌స్తుతం దిల్ రాజు సరైన డైరెక్ట‌ర్‌, స‌రైన కథ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ప‌వ‌న్ ఇమేజ్ మ‌రియు త‌న మార్క్ కలిపి ఒక కథను తయారు చేశాడ‌ట‌.

ఈ క‌థ దిల్ రాజుకు బాగా న‌చ్చింద‌ట‌. అలాగే ప‌వ‌న్‌కు కూడా అనిల్ క‌థ న‌చ్చుతుంద‌ని దిల్ రాజు న‌మ్మ‌కంగా ఉన్నార‌ట‌. ఇక ప్ర‌స్తుతం ఎఫ్ 3 చేస్తున్న అనిల్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని బాలకృష్ణతోగానీ.. శర్వానంద్ తో గానీ చేయ‌నున్నాడు. అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగితే.. ఆ త‌ర్వాత దిల్ రాజు – అనిల్ రావిపూడి – ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంటుంది. ఇదే జ‌రిగితే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పండ‌గే అని చెప్పాలి.