సుకుమార్ న‌యా ప్లాన్‌..పుష్ప‌1 త‌ర్వాత ఆ హీరోతో..?!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండతో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్‌పై గ‌త ఏడాదే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే సుక్కు న‌యా ప్లాన్ వేశాడ‌ట‌. పుష్ప ఫాస్ట్ పార్ట్ పూర్తి అయిన వెంట‌నే.. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్ల‌నున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేసేసి.. ఆ వెంటనే పుష్ప 2 సినిమాను మొదలు పెట్టాల‌ని సుకుమార్ భావిస్తున్నార‌ట‌.

కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోంది.

Share post:

Latest