`థ్యాంక్యూ`కు గుడ్‌బై చెప్ప‌నున్న‌ చైతు..ఆ వెంట‌నే..?

అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో థ్యాంక్యూ ఒక‌టి. విక్రమ్‌ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రంలో రాశీఖన్నా , మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతున్న త‌రుణంలో క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వేగం త‌గ్గుతుండడంతో.. థ్యాంక్యూ షూటింగ్‌ తిరిగి హైదరాబాద్‌లో స్టార్ట్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఓ ఆరు రోజుల చిత్రీకరణ జరుపుకుంటే థ్యాంక్యూ సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని తెలిసింది. అంటే ఆరు రోజుల చిత్రీకరణ త‌ర్వాత థ్యాంక్యూకు చూతు గుడ్ బై చెప్పేయ‌నున్నాడు. అంతేకాదు.. ఆ వెంట‌నే హిందీలో నటించనున్న తొలి చిత్రం లాల్‌ సింగ్‌ చద్దా చిత్రీకరణలో జాయిన్ అవ్వ‌నున్నాడ‌ట చైతు.

Share post:

Latest