రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా `మాస్ట‌ర్‌` భామ ఫిక్స‌ట‌?!

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతున్నాడు.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. కానీ, ఇప్ప‌టికే కియారా అద్వానీ, అలియా భట్ త‌దిత‌ర పేర్లు వినిపించాయి. తాజాగా మ‌రో పేరు తెర‌పైకి వ‌చ్చింది.

I died laughing seeing the toothpaste one': Malavika Mohanan on 'Master'  memes | The News Minute

ఇటీవ‌ల కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి స‌ర‌స‌న మాస్ట‌ర్ సినిమాలో ఆడిపాడిన మాళవిక మోహనన్ ను ఎంపిక చేసిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. ఇందులో భాగంగానే.. మాళ‌విక‌ను సంప్ర‌దించ‌గా ఆమె కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని టాక్‌. మరి ఇది ఎంత నిజ‌మో తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Latest