హాట్‌స్టార్‌తో `మాస్ట్రో` డీల్ పూర్తి..విడుద‌ల ఎప్పుడంటే?

యంగ్ హీరో నితిన్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మేర్లపాక గాంధీ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ కి ఇది రీమేక్‌. క్రైమ్‌ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. త‌మ‌న్నా నెగ‌టివ్ రోల్ పోషించింది.

ఈ మ‌ధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం థియేట‌ర్‌లో కాకుండా.. ఓటీటీలో విడుద‌ల కానుంది. ఈ సినిమా ఓటీటీ డీల్ ను కూడా క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ ఈ సినిమాను 32 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ సినిమా ఆగస్టులో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. కాగా, ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పించనున్నారు. ఇక నితిన్‌కు ఇది 30వ చిత్రం కావ‌డం విశేషం.

Share post:

Latest