ఓటీటీలో కీర్తి `గుడ్ లక్ సఖి`..క్లారిటీ ఇచ్చేసిన మేక‌ర్స్‌!

కిర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం గుడ్ లుక్ స‌ఖి. నగేష్ కుకునూర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఓ పల్లెటూరిలో అందరూ దురదృష్టానికి చిహ్నంగా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు లేకపోవడంతో గుడ్ లుక్ స‌ఖిని ఓటీటీలో విడుదల చేయ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5 ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై మేక‌ర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. గుడ్ లక్ సఖి సినిమా ఓటీటీలో విడుదల కానుందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని.. దయచేసి పుకార్లను స్ప్రెడ్ చేయొద్దని అభ్యర్ధించారు. ఏదైనా న్యూ అప్డేట్ ఉంటే స్వయంగా వెల్లడిస్తామని మేక‌ర్స్ తెలిపారు.

Share post:

Latest