చిరంజీవి చెల్లెలుగా బాల‌య్య హీరోయిన్‌..?!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.

ఇక ఈ చిత్రంలో చిరంజీవి చెల్లి పాత్ర ఒక‌టి ఉంటుంది. ఆ పాత్రకు ఇప్ప‌టికే చాలామంది సీనియ‌ర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఎవ‌రూ ఫైన‌ల్ కాలేదు. అయితే ఇప్పుడు మ‌రో పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆమె ఎవ‌రో కాదు ఎన్టీఆర్ బయోపిక్‌లో బాల‌య్య స‌ర‌స‌న న‌టించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్.

THIS is what Vidya Balan has to say about not featuring with A-list  superstars in her movies | Hindi Movie News - Times of India

చిరు సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్‌కు విద్యాబాలన్ అయితే బాగా సెట్ అవుతుంద‌ని భావించిన ద‌ర్శ‌కుడు.. ఇటీవ‌ల ఆమెను సంప్ర‌దించాడ‌ట‌. ఇక త‌న రోల్ న‌చ్చ‌డంతో.. ఆమె వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Share post:

Latest