ఎన్టీఆర్ మూవీలో కియారా..హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!?

June 16, 2021 at 7:47 am

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా రానున్న ఈ మూవీని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ న‌టిస్తుంద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మొన్నీ మ‌ధ్య కియారా కూడా త్వ‌ర‌లోనే తెలుగు సినిమా చేస్తాన‌ని చెప్ప‌డంతో.. ఈ ప్ర‌చారినికి మ‌రింత బ‌లం చేకూరింది.

అయితే ఇప్పుడు మ‌రో వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఎన్టీఆర్ సినిమాలో న‌టించేందుకు కియారా ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేసింద‌ట. ఇక కియారా క్రేజ్ దృష్ట్యా మేక‌ర్స్ కూడా ఆమె అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఎన్టీఆర్ మూవీలో కియారా..హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts