కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం..!

ప్రముఖ కన్నడ సినీ నటి బీ జయ (75) కన్నుమూశారు. వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. నటి జయ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. క్యారెక్టర్‌ నటిగా 350కిపైగా సినిమాలలో జయ నటించారు. 1944లో జన్మించిన ఆమె థియేటర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. 1958లో భక్తా ప్రహ్లాద చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కరియర్‌లో అనేర హాస్య, క్యారక్టెర్‌ పాత్రల్లో అభిమానుల్లో జయమ్మగా ప్రత్యేక పాత్రను దక్కించుకున్నారు.

డాక్టర్ రాజ్‌కుమార్, కల్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, ద్వారకేష్, బాలకృష్ణ వంటి తొలి తరం నటులతో ఆమె నటించారు.అయితే తరువాతి సంవత్సరాల్లో, ఆమె టెలివిజన్ సీరియళ్లలో కూడా కనిపించారు. 2004-05లో గౌడ్రూ మూవీలో నటనకు గాను జయమ్మ ఉత్తమ సహాయక నటి అవార్డు గెల్చుకున్నారు. జయకు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.