హీరో రామ్ ఫొటోలో ఇంత మ్యాటరుందా?

టాలీవుడ్ ఎనెర్జిటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు. దీంతో రామ్ తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. అయితే తాజాగా రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై చర్చ జరుగుతోంది. అందులో రామ్ కొత్త హెయిర్ స్టైల్ తో, గుబురు గడ్డంతో ఉన్నారు. దీంతో రామ్ తర్వాత నటించబోయే సినిమాలో ఇదే లుక్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.

రామ్ తన లుక్ గురించి ఈ ఫోటో ద్వారా క్లూ ఇచ్చాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగు స్వామి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను 2 నెలల క్రితమే లాంచ్ చేశారు. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లింగు స్వామి డైరెక్షన్ లో వచ్చిన ఆవారా, సికిందర్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాను సమంతతో యూ టర్న్ సినిమాను నిర్మించిన చిట్టూరి శ్రీనివాస్, బండారు రాంబాబు తెరకెక్కిస్తున్నారు.