లింగుస్వామి మూవీకి రామ్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే మైండ్‌బ్లాకే!?

టాలీవుడ్ ఎన‌ర్జిటివ్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రామ్‌.. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు. ఈ సినిమా త‌ర్వాత రామ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.

అదే స‌మ‌యంలో రామ్ త‌న రెమ్యున‌రేష‌న్‌ను కూడా భారీగా పెంచేశాడ‌ట‌. ప్ర‌స్తుతం రామ్ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంతో తెలుగుతో పాటు త‌మిళంలో కూడా తెర‌కెక్క‌నుంది.

అయితే ఈ చిత్రానికిగానూ రామ్ మైండ్‌బ్లోయింగ్ రెయ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్నాడ‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీకి రూ. 10 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, పవన్ కుమార్ సమర్పణల్, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Share post:

Popular