విష్వ‌క్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా..ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌తో..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో అక్టోబర్ 31 – లేడీస్ నైట్ చిత్రం ఒక‌టి. ఎ. ఎల్.విజయ్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళంలో కూడా రూపొందిస్తున్నారు.

త్రిపుర ఫేమ్ ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం హారర్ నేపథ్యంలో ఫస్ట్ హలోవీన్ మూవీగా తెర‌కెక్క‌నుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌తో విష్వ‌క్ రొమాన్స్ చేయ‌బోతున్నాడ‌ట‌.

మేఘా ఆకాష్, మంజిమా మోహన్, రెబ్బా మౌనిక జాన్, నివేదా పేతురాజ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది.

Share post:

Latest