దసరా రేసు నుండి `ఎఫ్‌3` ఔట్‌..రీజ‌న్ ఏంటంటే?

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి అనిల్ రావిపూడి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కిస్తున్నాడు.

ఎఫ్ 2లో న‌టించిన తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3లోనూ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఎఫ్ 3 ద‌స‌రా రేస్ నుంచి త‌ప్పుకున్న‌ట్టు టాక్‌. నిజానికి ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమ‌యంలో.. క‌రోనా సెకెండ్ వేవ్ వ‌చ్చి ప‌డింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది.

ఇక ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి త‌గ్గుతున్న నేప‌థ్యంలో జులై మొదటి వారం నుండి ఎఫ్3 నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశాడ‌ట అనిల్‌. ఈ షెడ్యూల్ లో అంద‌రూ పాల్గొనున్నార‌ట‌. అయితే ఆగస్ట్ లో వెంకీతో పర్సనల్ టూర్ ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. దీంతో మళ్ళీ షూటింగ్ సెప్టెంబర్, అక్టోబర్ లలో ఉంటుంద‌ట‌. ఈ లెక్క‌న చూస్తే దసరా రేసు నుండి ఎఫ్3 దూరమైనట్లే అని అంటున్నారు.