నేడు కాషాయ కండువా క‌ప్పుకోనున్న ఈట‌ల‌..ఏర్పాట్లు పూర్తి!

అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్.. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే నేడు ఈట‌ల కాషాయ కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు ఉద‌యం 11 గంటలకు బీజేపీ గూటికి చేరిపోనున్నారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం అవుతారు.

ఇందులో భాగంగా.. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య తదితరులు ఈ రోజు ఉదయం 6 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ ప‌య‌న‌మ‌య్యారు.

Share post:

Latest