పెళ్లి పీటలెక్క‌బోతున్న శంక‌ర్ కూతురు..వ‌రుడు అత‌డేన‌ట‌!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్‌ శంక‌ర్ ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. శంక‌ర్ పెద్ద కుమార్తె అదితి శంక‌ర్ పెళ్లి పీట‌లెక్కబోతోంది. తమిళనాడులోని పొలాచ్చిలో అదితి పెళ్లికి ఏర్పాట్లు జ‌రుగుతున్నారు.

 శంకర్‌కు కాబోయే అల్లుడు రోహిత్ టీఎన్‌పీఎల్(తమిళనాడు ప్రీమియర్ లీగ్)లో క్రికెటర్ కావడం విశేషం. రోహిత్ తండ్రి ప్రముఖ వ్యాపారవేత్తని తెలిసింది. జూన్ 27న అదితి, రోహిత్ వివాహం జరగనుంది. పొలాచ్చిలో ఇరు కుటుంబాలకు సంబంధించిన 100 మంది అతిథుల సమక్షంలో అదితి, రోహిత్ పెళ్లి జరగనున్నట్లు తెలిసింది.

ఇంత‌కీ అతిదిని పెళ్లాడ‌బోయే వ‌రుడు ఎవ‌రో కాదు.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ క్రికెటర్ రోహిత్. జూన్ 27న అంటే రేపు అదితి, రోహిత్ ల‌ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది.

 ప్రస్తుతం శంకర్ అల్లుడు ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. దర్శక దిగ్గజానికి కాబోయే అల్లుడెవరో తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతుకులాడుతున్నారు. క్రికెట్ జెర్సీ ధరించి రోహిత్ ఉన్న ఫొటో నెట్‌లో వైరల్‌గా మారింది.

క‌రోనా దృష్ట్యా పొలాచ్చిలో ఇరు కుటుంబాలకు సంబంధించిన వంద మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ట‌. ఇక ఇప్ప‌టికే ఇరు కుటుంబ స‌భ్యులు పొలాచ్చి చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక క‌రోనా అదుపులోకి వ‌చ్చిన త‌ర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ పెట్ట‌బోతున్నాడ‌ట శంక‌ర్.