విజ‌య్ సినిమా సీక్వెల్‌లో క‌మ‌ల్ హాస‌న్‌..?!

ఎఆర్ మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో విజయ్ ద‌ళ‌ప‌తి హీరోగా తెర‌కెక్కిన చిత్రం తుపాకీ. ఇందులో విజ‌య్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ న‌టించింది. ఈ చిత్రం అటు త‌మిళంలోనూ ఇటు తెలుగులోనూ విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెర‌కెక్కించే ప‌నుల్లో ప‌డ్డాడు ముర‌గదాస్‌. అయితే ఈ సినిమాలో హీరో విజ‌య్ కాద‌ట‌. తొలుత విజ‌య్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను ప్లాన్ చేసుకున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలోనే ముర‌గ‌దాస్ ఈ సినిమా క‌థ‌ను విశ్వ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు వినిపించాడ‌ని, దీనికి క‌మ‌ల్ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి నిజంగానే తుపాకీ 2కు క‌మ‌ల్ ఒకే చెప్పాడా..లేదా.. అన్న‌ది తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Latest