చిన్నారి చేసిన పనికి వావ్ అన్న మెగా స్టార్..!

మెగాస్టార్‌ చిరంజీవిని ఓ చిన్నారి ఇన్స్పెయిర్ చేసింది. తన పుట్టినరోజు సెలెబ్రేషన్స్ మానుకుని మరీ చిరంజీవి ట్రస్ట్ కి విరాళం ఇవ్వటంతో ఆ చిన్నారి చేసిన పనికి చిరు ఎంతో ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా అన్షి అనే చిన్నారిని చిరు ఎంతగానో మెచ్చుకున్నారు. చిరంజీవి ఇటీవలే కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ క్రమంలో అన్షి అనే చిన్నారి తన బర్త్ డే సందర్భంగా తాను పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకోటానికి అని దాచుకున్న డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది ఆ చిన్నారి. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పారు. అన్షి బర్త్ డే జూన్ 1న. తను దాచుకున్న డబ్బుతో పాటు తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు అయ్యే మొత్తం కూడా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల కోసం ఇచ్చింది. అన్షి ని అభినందిస్తూ, తన డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలని విష్ చేస్తున్నా.గాడ్ బ్లెస్ యు అన్షి. హ్యాపీ బర్త్ డే. లవ్ యూ డార్లింగ్ అంటూ చిరు ఆమెకు విషెస్ తెలిపారు.

Share post:

Latest