ఎన్టీఆర్ కాదు.. బ‌న్నీకి ఫిక్సైన `ఉప్పెన` డైరెక్ట‌ర్‌?!

ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ ప్రియశిష్యుడైన బుచ్చిబాబు సానా. ప్ర‌స్తుతం బుచ్చిబాబుతో సినిమాలు చేసేందుకు ప‌లువురు హీరోలు పోటీ ప‌డుతుంటే.. ఈయ‌న మాత్రం ఏదిఏమైనా స్టార్ హీరోతోనే త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించేందుకు ఓ స్పోర్ట్స్ డ్రామా క‌థను రెడీ చేసి పెట్టుకున్నారు.

అయితే ఈ మ‌ధ్య ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు, బుచ్చిబాబు చెప్పిన క‌థ కూడా ఎన్టీఆర్‌కు బాగా న‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇప్ప‌టికే ఎన్టీఆర్ వ‌రుస ప్రాజెక్ట్‌కు క‌మిట్ అయ్యి ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న‌తో సినిమా చేయాలంటే ఖ‌చ్చితంగా రెండు, మూడేళ్లు ఆగాల్సిందే.

అందుకే బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఫిక్స్ అయ్యాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే బుచ్చిబాబు తన వద్ద ఉన్న స్టోరీ లైన్ బ‌న్నీకి వినిపించగా.. ఆయన సానుకూలంగా స్పందించారట. ఇక అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ప్ర‌స్తుతం పుష్ప చేస్తున్న బ‌న్నీ.. ఆ త‌ర్వాత బుచ్చిబాబుతో త‌న త‌దుప‌రి సినిమా చేసే ఆవ‌కాశం ఉంటుంద‌ని టాక్‌.

Share post:

Latest