బ్రేకింగ్ : తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేత..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనాను దృష్టిలో పెట్టుకుని క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే రేప‌టితో ముగుస్తుండ‌టంతో కేసీఆర్ అధ్కక్ష‌త‌న భేటీ అయిన కేబినెట్ లాక్‌డౌన్ నిబంద‌న‌ల‌ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేబినెట్‌లో పాల్గొన్న ఎక్కువ మంది మంత్రులు లాక్‌డౌన్ ఎత్తివేయ‌డానికి ఓటేసిన‌ట్టు తెలిసింది.

రాష్ట్రంలో కొద్ది రోజులుగా క‌రోనా కేసులు కూడా చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌డుతూ ఉన్నాయి. ఇక దేశంలో చాలా రాష్ట్రాల‌తో పోలిస్తే మ‌న తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య త‌క్కువుగా ఉండ‌డంతో నైట్ క‌ర్ప్యూ కూడా వ‌ద్ద‌నే ఆలోచ‌న‌ను కేబినెట్ స‌మావేశం లో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. దీంతో రాష్ట్రంలో ఇక‌పై అన్ని కార్య‌క‌లాపాలు య‌థావిధిగా న‌డుస్తాయి. అయితే ఈ విష‌యాల‌పై పూర్తి మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌భుత్వం సాయంత్రం వ‌ర‌కు విడుద‌ల చేస్తుంద‌ని స‌మాచారం. అధికారులు కూడా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని చెప‌ప‌డంతోనే కేబినెట్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న సెకండ్ వేవ్ పూర్తిగా కంట్రోల్ లో ఉంద‌ని కేబినెట్ తెలిపింది.

Share post:

Latest