బ్రేకింగ్ : కర్ఫ్యూ నిబంధనల్లో కీలక మార్పులు…!

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో ఇటు తెలంగాణ‌తో పాటు అటు ఏపీలోనూ క‌ర్ప్యూ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. కాగా ప్ర‌స్తుతం ఈ క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం జూన్ 30వ‌ర‌కు పొడిగించింది. అయితే ఇందులో తాజాగా కొన్ని స‌డ‌లింపులు ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భ‌త్వం.

జూన్ 21నుంచి సాయంత్రం ఆరుగంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. సాయంత్రం 6నుంచి ఉద‌యం 6గంట‌ల దాకా క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు అమల్లో ఉంటాయ‌ని తెలిపింది. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వివ‌రించింది. అయితే తూర్పు గోదావ‌రి జిల్లాలో మాత్రం మ‌ధ్యాహ్నం 2గంట‌ల వ‌ర‌కే ప‌ర్మిష‌న్ ఇస్తూ వ‌చ్చింది ప్ర‌భుత్వం. ఆ జిల్లాలో క‌రోనా ఎక్కువ‌గా ఉండ‌టంతోనే ఈ నిర్ణ‌యంతీ సుకున్న‌ట్టు తెలిపింది. కాగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌న్నీ య‌థాత‌తంగా న‌డుస్తాయ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ప్ర‌జ‌లంద‌రూ ఈ నిబంద‌న‌లు పాటించాల‌ని, క‌రోనా నిబంధ‌న‌లు ఎవ‌రూ పాటించ‌కున్నా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది.

Share post:

Latest