బాల‌య్య కోసం లైన్‌లో ఉన్న ముగ్గురు హీరోయిన్లు!

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న బాల‌య్య‌. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెర‌కెక్క‌బోతోంది. ఇక ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది ఇప్ప‌టి వ‌రకు క్లారిటీ రాలేదు. అయితే గోపీచంద్ మాలినేని ఈ సినిమాలో మొద‌టి నుంచి శ్రుతిహాస‌న్‌ను తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

మ‌రోవైపు మైత్రీ మూవీ మేక‌ర్స్ నయనతారను హీరోయిన్ గా ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నార‌ట‌. ఇక ఇప్పుడు సీనియ‌ర్ హీరోయిన్ త్రిష పేరుకు కూడా తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి బాల‌య్య కోసం లైన్‌లో ఉన్న ఈ ముగ్గురు హీరోయిన్ల‌లో ఎవ‌రు ఫైన‌ల్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Share post:

Latest