ఎట్ట‌కేల‌కు అందుకు ఒప్పుకున్న‌అనుష్క.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌?!

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బెంగుళూరు భామ‌.. ప్ర‌స్తుతం జోరు త‌గ్గించేసింది. ఈమె నుంచి సంవ‌త్స‌రానికి ఓ సినిమా రావ‌డం కూడా గ‌గ‌న‌మైంది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌ల నిశ్శబ్దం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది అనుష్క‌. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

ఇక రా రా కృష్ణయ్య ఫేమ్ మహేష్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.యూవీ క్రియేషన్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో జాతిరత్నాలు హీరో నవీన్‌ పోలిశెట్టి న‌టించ‌నున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. అన్నీ సిద్ధంగా ఉన్నా అనుష్క డేట్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో.. ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. షూటింగ్‌కు ఒప్పుకుంద‌ట అనుష్క‌. దాంతో ఈ చిత్రం జూన్ నెలాఖరు నుండి స్టార్ట్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక అనుష్క ఎట్ట‌కేల‌కు మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ చిత్రానికి మిస్ శెట్టి ..మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ని పరిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం.

Share post:

Latest