మైత్రీతో అఖిల్ ల‌వ్ స్టోరీ..త్వ‌ర‌లోనే..?

అక్కినేని నాగార్జున న‌ట వార‌సుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అక్కినేని అఖిల్‌.. హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌ అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఇక అఖిల్ నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ స్పై థ్రిల్లర్ ఏజెంట్ అనే సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌గా.. ప్ర‌స్తుతం ఇది షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం..అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అఖిల్‌తో ఓ ల‌వ్ స్టోరీ చిత్రం చేయ‌బోతున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం ఇందుకు జోరుగా స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ, త్వ‌ర‌లోనే అన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయ‌ని తెలుస్తోంది.

Share post:

Latest