25 ఏళ్ల తరవాత కమల్‌తో న‌టిస్తున్న ప్ర‌ముఖ హీరోయిన్‌?

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో పాపనాశం 2 ఒక‌టి. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, మీనా నటించిన దృశ్యం 2 ఇది రీమేక్‌. మ‌ల‌యాళంలో తెరకెక్కించిన జీతు జోసెఫ్ నే త‌మిళంలోనూ పాపనాశం 2ను డైరెక్ట్ చేయ‌నున్నాడు.

- Advertisement -

అయితే పాపనాశం 1లో క‌మ‌ల్ స‌ర‌స‌న గౌతమి న‌టించింది. అప్పుడు గౌతమి, కమల్ హాసన్ రిలేషన్ లో కూడా ఉన్నారు. అయితే 2016లో కొన్ని సమస్యల కారణంగా ఈ జంట విడిపోయారు. అందుకే పాపనాశం 2లో గౌత‌మి న‌టించే ఛాన్స్ లేదు. అందుకే క‌మ‌ల్ గౌత‌మిని ప‌క్క‌న పెట్టేసి.. ఒరిజినల్ వెర్షన్లో, తెలుగు రీమేక్ దృశ్యం 2 లో నటించిన మీనానే హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారట.

ఇందుకు సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని.. మీనా కూడా క‌మ‌ల్ స‌ర‌స‌న న‌టించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని టాక్ న‌డుస్తోంది. ఇదే నిజ‌మైతే.. 25 ఏళ్ల తరవాత కమల్‌తో మీనా న‌టిస్తున్న‌ట్టు అవుతుంది. గ‌తంలో కమల్, మీనాలు కలిసి 1996లో అవ్వై షణ్ముఖి చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజ‌యం కూడా సాధించింది.

Share post:

Popular