క‌మ‌ల్ హాస‌న్‌కు విల‌న్‌గా మారిన విజ‌య్ సేతుప‌తి?!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి ఒకే స‌మ‌యంలో అటు హీరోగానూ, ఇటు విల‌న్‌గానూ న‌టిస్తూ విల‌క్ష‌ణ న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌నకు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే లోకనాయకుడు కమల్ హాసన్ తాజా చిత్రం విక్ర‌మ్‌లో న‌టించే ఛాన్స్ విజ‌య్ సేతుప‌తికి ద‌క్కింది. లోకేష్ కనకరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌‌కి చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మిస్తోంది.

అయితే ఈ చిత్రంలో క‌మ‌ల్‌కు విల‌న్‌గా విజ‌య్ సేతుప‌తిని ఎంపిక చేశార‌ట‌. ఇందులో భాగంగానే.. విజ‌య్‌ను సంప్ర‌దించ‌గా ఆయ‌న కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇదే నిజ‌మైతే.. ఇద్ద‌రు విల‌క్ష‌ణ న‌టులు ఒకే స్క్రీన్‌పై క‌నిపించ‌నున్నారు.

Share post:

Latest