రౌడీ హీరో బర్త్ డే స్పెషల్ అదేనాట ..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ అభిమానులకు ఈ నెల 9 వ తేదీ చాలా ప్రత్యేకం ఎందుకంటే ఆ రోజు విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు కాబ్బటి. అయన బర్త్ డే సందర్బంగా ఆయన అభిమానులకు ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ సిద్ధం చేయిస్తున్నారట దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ రోజున విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం లైగర్‌కి చెందిన ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్ కానుందని భావిస్తున్నారు విజయ్ అభిమానులంతా.

ఒకవేళ వీడియో రెడీ అవ్వకపోతే లైగర్‌కి సంబంధించి ఏదొ ఒక అప్‌డేట్‌ అయినా వస్తుందనే టాక్పూ వినిపిస్తుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఈ మూవీకి చార్మి నిర్మాత. ఇందులో బాలీవుడ్‌ భామ అనన్యా పాండే హీరోయిన్‌గా చేస్తుంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా లైగర్‌ మూవీ షూట్ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్ కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా కాస్త వాయిదా పడుతుందని భావిస్తున్నారు.

Share post:

Latest