న్యాచుర‌ల్ స్టార్‌ను లైన్‌లో పెట్టిన‌ `వ‌కీల్ సాబ్` డైరెక్ట‌ర్‌?!

వేణు శ్రీ‌రామ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన వేణు శ్రీ‌రామ్‌.. ఆ త‌ర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తెర‌కెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవ‌ల ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌కీల్ సాబ్‌ను రూపొందించి.. ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు.

ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వేణు శ్రీ‌రామ్ క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో ఈయ‌న నెక్ట్స్ ఏ హీరోతో చేస్తాడ‌న్న ప్ర‌శ్న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే వ‌కీల్ సాబ్ సెట్స్ మీద ఉన్న‌ప్పుడే అల్లుఅర్జున్‌తో ఐకాన్‌ చిత్రాన్ని ప్రకటించారు. కానీ, బ‌న్నీ ఇంట్ర‌స్ట్ చూప‌క‌పోవ‌డంతో.. ఈ ప్రాజెక్ట్ ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్కె ప‌రిస్థితి లేదు.

అందుకే వేణు శ్రీ‌రామ్ న్యాచుర‌ల్ స్టార్ నానిని లైన్‌లో పెట్టాడ‌ట‌. ఇందులో భాగంగానే వేణు శ్రీ‌రామ్ ఇటీవ‌ల నానినికి ఓ క‌థ వినిపించార‌ని.. అది బాగా న‌చ్చ‌డంతో ఆయ‌న సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంత ఉందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

Share post:

Latest