మ‌రో రీమేక్ చిత్రానికి వెంకీ గ్రీన్‌సిగ్నెల్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

May 4, 2021 at 10:55 am

ప్ర‌స్త‌తం విక్ట‌రీ వెంక‌టేష్ వ‌రుస రీమేక్‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈయన నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన అసురన్‌కు రీమేక్‌. అలాగే ఇటీవ‌లె దృశ్యం 2 చిత్రాన్ని సెట్స్ మీద‌కు తీసుకెళ్లాడు వెంకీ.

ఈ చిత్రం మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యం 2కు రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో రీమేక్ చిత్రానికి వెంకీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అదే మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్.

పృథ్వీరాజ్, సూరజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ఈగోల నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్ప‌టి నుంచో స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అయితే ఈ రీమేక్ చిత్రం చేసేందుకు వెంకీ ఇంట్ర‌స్ట్‌గా ఉన్నార‌ని.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని ప్ర‌చారం జ‌రుగోతంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో చూడాలి.

మ‌రో రీమేక్ చిత్రానికి వెంకీ గ్రీన్‌సిగ్నెల్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts