మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమా టైటిల్ అదేన‌ట‌?!

May 4, 2021 at 10:27 am

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇటీవ‌లె అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది.

హారిక అండ్ హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ రాబోతున్న చిత్రం కావ‌డంతో.. అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

ఇంత‌కీ ఆ వార్త సారాంశం ఏంటంటే.. ఈ సినిమాకు పార్థు అనే టైటిల్ ను త్రివిక్ర‌మ్ అనుకుంటున్నాడట. ఆ టైటిల్ మ‌హేష్‌కు కూడా బాగా న‌చ్చ‌డంతో.. దాన్నే ఫైన‌ల్ చేశారట‌. అయితే ఈ వార్తలో ఎంత నిజ‌ముందో తెలియ‌దు. కానీ, మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో వచ్చిన అతడు చిత్రంలో మహేష్ పాత్ర పేరు పార్థునే.

మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమా టైటిల్ అదేన‌ట‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts