ఆ హిట్‌ డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన మెగా మేన‌ల్లుడు?!

May 4, 2021 at 12:26 pm

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఇటీవ‌లె ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇక ఉప్పెన విడుద‌ల‌కు ముందే క్రిష్ దర్శ‌క‌త్వంలో రెండో సినిమాను కూడా పూర్తి చేసిన వైష్ణ‌వ్‌.. మ‌రో రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు.

వైష్ణవి తేజ్ తో మరో దర్శకుడు.. కథ కూడా ఫిక్స్

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో డైరెక్ట‌ర్‌కు కూడా వైష్ణ‌వ్ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. ఛ‌లో, భీష్మ చిత్రాల‌తో వ‌రుస హిట్లు అందుకున్న ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల.

ఇటీవ‌లె వెంకీ వైష్ణ‌వ్ కు ఓ క‌థ చెప్పాడ‌ట‌. అది బాగా న‌చ్చ‌డంతో వైష్ణ‌వ్ వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ పై ప్ర‌క‌ట‌న రానుంద‌ని ప్ర‌చారం న‌డుస్తోంది.

ఆ హిట్‌ డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన మెగా మేన‌ల్లుడు?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts