ఆ క్రెడిట్ వారికే : తమన్

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ‘అల వైకుంఠపురములో’ సినిమాకి అందించిన పాటలకి విశేషమైన ఆదరణ లభించింది. ఆ పాటల హోరు, జోరు ఇప్పటికీ తగ్గలేదు. ఆ పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ ను మూడగడుతూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో తమన్ ఈ సినిమాను గురించి మాట్లాడారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలకు వచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా సంతోషం కలిగింది. అందరూ కూడా ఆ పాటలను పాడుకుంటున్నారు..ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ పాటలకు డాన్సులు చేస్తుండటం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. త్రివిక్రమ్ గారికి సంగీత సాహిత్యాల పట్ల మంచి అవగాహన ఉంది. తన కథకి .. సందర్భానికి తగిన పాట ఎలా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన తన భావాలను చక్కగా చెప్పడం వలన నాకు వర్క్ ఈజీ అవుతుంది..అని తమన్ అన్నారు. ఈ సినిమా క్రెడిట్ విషయంలో 35 శాతం త్రివిక్రమ్ కు, 35 శాతం బన్నీ కి వెళుతుంది. మిగతా 30 శాతం మాత్రమే నాకు చెందుతుంది. ఇక లిరిక్ రైటర్స్ ప్రతిభా పాటవాలు కూడా ఈ రెస్పాన్స్ కి కారణమని చెప్పుకోవాలి. ఒక సంగీత దర్శకుడిగా ఇది నా ఒక్కడి గొప్పతనమేనని చెప్పను .. ఇది సమష్టి కృషి” అని చెప్పుకొచ్చారు.

Share post:

Latest