ఆర్ యూ వర్జిన్? అని ప్ర‌శ్నించిన నెటిజ‌న్‌..సురేఖావాణి కూతురు ఘాటు రిప్లై!

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీతా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోయినా సోష‌ల్ మీడియా ద్వారా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. త‌ర‌చూ త‌ల్లితో కలిసి పార్టీలలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సుప్రిత‌.

అంతేకాదు, ఈ మ‌ధ్య వరుసగా లైవ్ చాట్‌లు పెడుతూ.. తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతొంది సుప్రిత‌. తాజాగా మరోసారి సుప్రిత సోషల్ మీడియోలో లైవ్ సెషన్ పెట్టారు. అందులో ఏదైనా ప్రశ్నను అడగండి.. సమాధానాలు చెబుతాను అని అన్నారు. దాంతో ఓ నెటిజ‌న్ ఏకంగా ఆర్ యూ వర్జిన్? అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు స‌ప్రిత ఘాటు రిప్లే ఇచ్చింది.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలోని కోర్డ్ సీన్ సుప్రిత వాడుకుంది. అందులో ప్ర‌కాష్ రాజ్ నివేదా థామస్ ని ఈ ప్ర‌శ్నే అడుగుతుండ‌గా.. పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోతూ అబ్జెక్షన్ అంటూ కోర్టు రూంలో గందరగోళాన్ని సృష్టించే సీన్‌‌ను సుప్రిత షేర్ చేసింది. మొత్తానికి ఆడపిల్లను అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజెన్ కి పవన్ చేత గడ్డి పెట్టించింది సుప్రీత‌.